రాష్ట్రంలోనే తొలిసారిగా ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫేమ్ 2 విధానంలో భాగంగా... తిరుమల-తిరుపతి మధ్య 100 బస్సులను తిప్పుతామని వెల్లడించారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రగామి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్, ఈవీ ట్రాన్స్ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియం నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం 100 ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్కాస్ట్ కాంట్రాక్ట్ అపెక్స్ మోడల్ ప్రాతిపదికన అందించాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు 12 సంవత్సరాలు అమలులో ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపు రూ.140 కోట్లుగా నిర్ణయించారు. ఈ బస్సులను తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి నిర్వహిస్తారు. ఇందులో 50 బస్సులను తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులోనూ, మరో 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లి పట్టణాలకు ఇంటర్‌సిటీ సర్వీసులుగా నడపనున్నారు.
E-BUS : 'రాష్ట్రంలోనే తొలిసారిగా ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు'
రాష్ట్రంలోనే తొలిసారిగా ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 50 బస్సులను తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులోనూ, మరో 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లి పట్టణాలకు ఇంటర్‌సిటీ సర్వీసులుగా నడపుతామని వెల్లడించారు.
ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సు