ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి రాత్రి నుంచి శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల శ్రీవారి ఆలయాన్ని సూర్యగ్రహణం కారణంగా అధికారులు మూసివేయనున్నారు. ఇవాళ్టి రాత్రి 11 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకూ స్వామి వారి ఆలయం మూతపడనుంది. ఆలయ శుద్ధి అనంతరం రెండు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.

due-to-the-solar-eclipse-the-doors-of-the-tirumala-srivari-temple-will-be-closed
నేటి రాత్రి నుంచి శ్రీవారి ఆలయం మూసివేత

By

Published : Dec 24, 2019, 5:06 AM IST

Updated : Dec 25, 2019, 6:08 AM IST

సూర్యగ్రహణం కారణంగా నేటి రాత్రి 11 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకూ 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తలుపులు తెరిచి ఆలయ శుద్ధి అనంతరం రెండు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. 26న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. గ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12గంటల వరకు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సు సైతం మూతపడనుంది.

కాణిపాకం ఆలయం మూసివేత

సూర్యగ్రహణం కారణంగా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయాన్ని ఇవాళ్టి రాత్రి 9.30 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మూసివేయనున్నారు. ఉదయం ఆర్జిత సేవలను రద్దు చేయనున్నట్లు ఈవో దేముళ్లు తెలిపారు.

యథాతథంగా ముక్కంటి సేవలు

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గ్రహణ సమయంలో స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించనున్నారు. రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలు, మూల మూర్తుల దర్శనం కొనసాగుతుంది. ఇతర ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు.

ఇవీ చూడండి:

'రాష్ట్రాభివృద్ధికి చేయాల్సింది ఎప్పుడూ చేస్తూనే ఉంటా'

Last Updated : Dec 25, 2019, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details