ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపాలో చంద్రబాబు, లోకేశ్ మాత్రమే మిగులుతారు' - narayanaswamy comments on lokesh

తెలుగుదేశం పార్టీలో చివరకు మిగిలేది చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ మాత్రమేనని... ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

deputy chief minister narayanaswamy sensational comments on tdp
'తెదేపాలో చంద్రబాబు, లోకేశ్ మాత్రమే మిగులుతారు'

By

Published : Jan 12, 2020, 1:38 PM IST

మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. వైకాపా తలుపులు తెరిస్తే తెదేపా ఎమ్మెల్యేలందరూ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో చివరకు మిగిలేది చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో... చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ సంగతేంటని విలేకరులు ప్రశ్నించగా... ఆయన కూడా వస్తారని చెప్పారు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసునుంచీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సాయంతోనే బయటపడ్డారని గుర్తుచేశారు. తెదేపా ఎమ్మెల్యేలను బెదిరింపులతో చేర్చుకుంటారా..? అని విలేకర్లు ప్రశ్నించగా... దానికి సమాధానం ఇవ్వలేదు.

ABOUT THE AUTHOR

...view details