ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మానవత్వం మాయం: కరోనాతో మరణం... జేసీబీతో ఖననం - corona victim's dead body moved with jcb news

controversy-over-burial-of-corona-victim-in-tirupati
controversy-over-burial-of-corona-victim-in-tirupati

By

Published : Jul 6, 2020, 2:36 PM IST

Updated : Jul 6, 2020, 3:55 PM IST

14:32 July 06

తిరుపతిలో అమానవీయ ఘటన

 శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగి మృతదేహాన్ని జేసీబీ తొట్టెలో శ్మశానానికి తీసుకెళ్లిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. కరోనా వైరస్​ సోకి కన్నుమూసిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీ సాయంతో ఖననం చేశారు అధికారులు. ఈ ఘటన స్థానిక హరిశ్చంద్ర వాటికలో జరిగింది.  

కరోనా రోగి మృతదేహాన్ని అంబులెన్సులో శ్మశాన వాటికకు తీసుకొచ్చిన వైద్య సిబ్బంది... అనంతరం జేసీబీ సాయంతో ఖననం చేశారు. వైద్య సిబ్బంది తీరు వివాదాస్పదమైంది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో ఇలా వ్యవహరించడమేంటని కొందరు విమర్శిస్తున్నారు. అయితే మృతుడి బరువు 155 కిలోలు ఉన్నందునే జేసీబీ సాయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

Last Updated : Jul 6, 2020, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details