తిరుమలవాసుని మెట్టుమార్గంలో చిరు వ్యాపారులపై వైకాపా నేతల అనుచరులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ... సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. శ్రీవారి మెట్టు వద్ద ధర్నా చేశారు. ఇలాంటి చర్యలను ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దాడులను ఖండించాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహించడం సరికాదని, తమకు న్యాయం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చిన్న వ్యాపారస్తులకు లైసెస్సులిచ్చి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని కోరారు.
వైకాపా నేతల దాడిని నిరసిస్తూ ఆందోళన
శ్రీవారి మెట్టు దారిలో చిరు వ్యాపారులపై వైకాపా నేతల దాడిని నిరసిస్తూ... సీఐటీయూ ఆందోళనకు దిగింది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
సిఐటియూ ధర్నా