వైద్య విద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లిన చిత్తూరు విద్యార్ధులు పలువురు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రష్యా దాడుల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఆవేదన చేస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉంటున్న చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన విద్యార్ధిని సాయినిఖిత తన తల్లిదండ్రులతో మాట్లాడారు.
ఉక్రెయిన్‌లో చిత్తూరు జిల్లా విద్యార్దుల వెతలు - చిత్తూరు జిల్లా విద్యార్దులు
వైద్య విద్యను అభ్యసించేందుకు చిత్తూరు జిల్లా నుంచి ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఇక్కడ వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.
సాయినిఖిత
తాము ఉంటున్న పరిసర ప్రాంతాలలో బాంబు దాడులు జరుగుతున్నట్లు అమ్మాయి వివరించారు. భారతదేశానికి రావడానికి ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదన్నారు. తమను సురక్షితంగా తీసుకెళ్లాలని విద్యార్ధిని కోరారు. కుమార్తె ఉక్రెయిన్‌లో ఇరుక్కపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురవుతున్నారు.