తిరుమల శ్రీవారి సహస్ర దీపాలంకరసేవలో... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బోబ్డే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి పాల్గొన్నారు. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తులు... స్వామివారికి నిర్వహించిన సేవలో పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపులో స్వామివారి పల్లకి మోశారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి... జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ జీకే మహేశ్వరికి స్వాగతం పలికి... దర్శన ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి