ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నన్ను అడ్డుకోలేరు... నేను తగ్గేది లేదు' - చంద్రబాబు చిత్తూరు పర్యటన అప్​డేట్స్

పోలీసు చర్యలతో తన సంకల్పాన్ని అడ్డుకోలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజల్ని కలవనీయకుండా అడ్డుకోవటం తగదని ముఖ్యమంత్రి జగన్​కు హితవు పలికారు.

chandra babu fires on ysrcp government
chandra babu fires on ysrcp government

By

Published : Mar 1, 2021, 1:11 PM IST

చిత్తూరు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని కలవనీయకుండా తనను అపడం తగదని ట్వీట్​ చేశారు. భయంతో ఎన్నిరోజులు పాలన సాగిస్తారని నిలదీశారు. జగన్‌ ఇంకా రాజకీయ పరిణితి సాధించాలని హితవు పలికారు.

'నన్ను అడ్డుకోలేరు.. నేను తగ్గేది లేదు. ప్రజల్ని కలవకుండా నన్ను ఎవరూ ఆపలేరు'- చంద్రబాబు

రేణిగుంట విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును... అనుమతి లేదంటూ పోలీసులు ఎయిర్ పోర్టులోనే ఆపేశారు. దాదాపు 2 గంటలుగా ఆయన విమానాశ్రయంలోనే ఉన్నారు.

ఇదీ చదవండి:

పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు

ABOUT THE AUTHOR

...view details