ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Somu veerraju : 2024లో అధికారం దిశగా అడుగులేయాలని అమిత్ షా దిశానిర్దేశం: వీర్రాజు

2024లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata party) అధికారంలోకి వచ్చే విధంగా అడుగులు వేయాలని కేంద్రమంత్రి అమిత్ షా(centrel minister Amit shah) సూచించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలను భాజపా లో చేర్చుకుని, ఏపీలో అధికారం దిశగా కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు.

తిరుపతిలో భాజపా నేతల సమావేశం
తిరుపతిలో భాజపా నేతల సమావేశం

By

Published : Nov 15, 2021, 5:35 PM IST

తిరుపతిలో భాజపా నేతల సమావేశం

2024లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అడుగులు వేయాలని కేంద్రమంత్రి అమిత్ షా సూచించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(BJP state president somu veerraju) అన్నారు. తిరుపతి(tirupati) వేదికగా రాష్ట్ర భాజపా నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సోము వీర్రాజు, పురందేశ్వరి(Purandeshwari), సీఎం రమేశ్(CM.Ramesh), సుజనా చౌదరి(Sujana Choudary) పాల్గొన్నారు. సమావేశం అనంతరం సోము వీర్రాజు, పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.

2024లో అధికారం దిశగా అడుగులేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ముఖ్య నేతలను చేర్చుకుని ఏపీలో అధికారం దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు భాజపా కృషి చేస్తోంది. ఏపీలో గ్రామీణాభివృద్ధికి సాయం చేస్తామని అమిత్ షా చెప్పారు.- సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలను భాజపాలో చేర్చుకుని, ఏపీలో అధికారం దిశగా కార్యాచరణ రూపొందిస్తామని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు భాజపా కృషి చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి సహాయం చేస్తానని అమిత్ షా చెప్పారన్నారు. ఏపీ విభజన బిల్లు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు వివరించారు. విభజన బిలులోని 80శాతం అంశాలను కేంద్రం నెరవేర్చిందన్న పురందేశ్వరి... మిగతా 20శాతం అంశాలపై చర్చించినట్లు చెప్పారు.

ఏపీ విభజన బిల్లు అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించాం. విభజన బిల్లులోని 80 శాతం అంశాలను కేంద్రం నెరవేర్చింది. విభజన బిల్లులోని మిగతా 20 శాతం అంశాలపైనా చర్చలు జరిపాం. - పురందేశ్వరి, భాజపా జాతీయ నాయకురాలు

ఇవీచదవండి

ABOUT THE AUTHOR

...view details