తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీనటుడు భరత్‌రెడ్డి, తితిదే పాలకమండలి సభ్యుడు మొరంశెట్టి రాములు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Tirumala: శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖలు - tirumala latest news
తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి..స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సినీ నటుడు భరత్ తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో మిల్లెట్ మార్వెల్ సంస్థను ఏర్పాటుచేశామన్న భరత్... మన పూర్వీకుల ఆహారపు అలవాట్లను తిరిగి విస్తరించడమే లక్ష్యమని చెప్పారు. మిల్లెట్ మార్వెల్ సంస్ధను స్ధాపించి అభివృద్ధి చేసేందుకు నాలుగు సంవత్సరాలు పట్టిందన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాల ఆహారంను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి:TIRUMALA TIRUPATHI BRAHMOTHSAVALU: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రమే అంకురార్పణ