తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాంశంకర్ కటారియా, తమిళనాడు మంత్రి సెల్లురురాజు... ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పరిపాలన వికేంద్రీకరణ సహా రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వాలని... స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి మోపిదేవి తెలిపారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రముఖులు - తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రముఖుల వార్తలు
పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మంత్రి మోపిదేవి, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాంశంకర్ కటారియా, తమిళనాడు మంత్రి సెల్లురురాజు స్వామివారిని దర్శించుకున్నారు.
Celebrities visited Thirumala Srivararu