తెలుగుదేశం అధినేత నేడు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం మున్సిపాల్టీకి ఇవాళ ఎన్నిక జరుగుతుండటంతో అక్కడ అధికార వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తెదేపా ఆరోపిస్తోంది. దొంగ ఓట్లు వేసేందుకు ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులను మోహరించిందని, రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు డీజీపీ, ఇతర రాజ్యాంగబద్ద సంస్థలకు తెదేపా ఫిర్యాదు చేసింది.
నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. - kuppam latest news
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికను పరిశీలించనున్నారు.
cbn in kuppam tour
ఎన్నికల సరళిని స్వయంగా పర్యవేక్షించేందుకు చంద్రబాబు కుప్పంలో పర్యటించాలని నిర్ణయించారు. ఉదయాన్నే.. అమరావతి నుంచి బెంగళూరు లేదా తిరుపతి వెళ్లి అక్కడి నుంచి కుప్పం చేరుకోనున్నారు.
ఇదీ చదవండి: kuppam elections: ఎన్నికల వేళ కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు.. తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ