Brother killed younger brother: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కాకువారిపాలెంలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం కారణంగా.. సొంత తమ్ముడైన ప్రతాప్‌ను తొడబుట్టిన అన్న బాలాజీ కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. బాలాజీ, ప్రతాప్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. 10 నెలల క్రితం తమ్ముడు ప్రతాప్ భార్య చనిపోవడంతో.. అన్న బాలాజీ ఇంటివద్దే ఉంటున్నాడు. అన్న భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. బాలాజీ వ్యవసాయ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి ప్రతాప్‌తో.. తన భార్య కలిసి ఉండటం చూసిన బాలాజీ.. కర్రతో ప్రతాప్ తలపై కొట్టాడని స్థానికులు తెలిపారు. ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిల్లకూరు పోలీసులు ఘటనా పరిశీలించి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Brother killed younger brother: తమ్ముడిని చంపిన అన్న... కారణం అదేనా..! - illegal affair
Brother killed younger brother: తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. సొంత తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. అసలేం జరిగందంటే..?
murder
Last Updated : Sep 11, 2022, 5:56 PM IST