తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో దాతలకు కల్పించే సౌకర్యాలను, ప్రత్యేక దర్శనాలను తితిదే పూర్తిగా రద్దు చేస్తోంది. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 10 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాధారణ రోజుల్లో కన్నా బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భక్తులదరికీ వసతులు కల్పించేందుకు తితిదేకు విరాళాలు సమర్పించే దాతలతో పాటు.. సిఫార్సు లేఖలపై కేటాయించే గదులు, దర్శనాల రద్దుకు అధికారులు సంకల్పించారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలనూ... ఉత్సవాల సమయంలో రద్దు చేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో.. దాతలకు ప్రత్యేక సౌకర్యాలు రద్దు - special darshan
శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తితిదేకు విరాళాలు సమర్పించే దాతలకు ఎప్పటి మాదిరిగా కల్పించే సౌకర్యాలు, ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్ల్లో దాతలకు ప్రత్యేక సౌకర్యాలు రద్దు