ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రత్యేక ఆహ్వానితులు తితిదే బోర్డు సభ్యులుగా ప్రమాణం చేయడమేంటి? ' - తిరుపతి

ప్రత్యేక ఆహ్వానికులు తితిదే బోర్డు సభ్యులుగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారని భాజపా రాష్ట్ర కార్యదర్ని భానుప్రకాష్ రెడ్డి తిరుమలలో ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే దీనిపై సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తితిదే ఆలయ నిబంధనలను విస్మరిస్తోంది: భానుప్రకాశ్ రెడ్డి

By

Published : Sep 24, 2019, 2:23 PM IST

ప్రభుత్వం తితిదే ఆలయ నిబంధనలను విస్మరిస్తోంది: భానుప్రకాశ్ రెడ్డి
నిబంధనలకు విరుద్ధంగా తితిదే ధర్మకర్తల మండలి వ్యవహరిస్తోందని భాజాపా రాష్ట్ర కార్యదర్శి, తితిదే బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చేసే ఆర్హత లేదని ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. నిబంధనలను పక్కన పెట్టి తితిదే బోర్డు సభ్యులుగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయటం వెనుక ఆంతర్యమేంటో ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గతంలో బోర్డు సభ్యుడిగా పనిచేసిన సమయంలో ప్రత్యేక ఆహ్వానితులు ఎవరూ ప్రమాణ స్వీకారం చేయలేదని గుర్తు చేశారు. మొదటి సమావేశంలో సొంత విషయాలకే ప్రాధాణ్యం ఇచ్చారని ఆరోపించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించకపోవడం బాధాకరమన్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణంపై పూర్తి స్థాయిలో చర్చలు జరపకుండా నిధుల తగ్గింపు నిర్ణయం తీసుకోవడమేంటని మండిపడ్డారు.

ఇది చదవండి:

ABOUT THE AUTHOR

...view details