పోలీసులపై దాడులు చేసిన కేసులను ప్రభుత్వం రద్దు చేస్తోందని.. వైకాపా కేసుల రద్దు ప్రభుత్వంగా రుజువు చేసుకుంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో ఆరోపించారు. రాయచోటి సంఘటనలో కేసులు రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏడు కొండల సాక్షిగా ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయనున్నట్లు ప్రకటించారు. వైకాపా మత రాజకీయాలకు పాల్పడుతోందని.. సీఎం సెక్యులర్ గా వ్యవహరించడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్ నుంచి తొలగించడంలో ప్రభుత్వ ఉద్దేశంమేంటని ప్రశ్నించారు. వక్ఫ్‌బోర్డ్ లకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. తితిదే నుంచి నిధులు తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.
తెలుగు భాషకోసం ఉద్యమిస్తాం..