Bail sanction in Tenth Paper leakage case : పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ చిత్తూరు నాలుగవ అదనపు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్టు అయ్యి రిమాండ్ పూర్తి చేసుకున్న ఏడుగురు బెయిలు కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 14 రోజులపాటు రిమాండ్ పూర్తి కావడంతో శుక్రవారం వీరికి న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి, శ్రీ కృష్ణ రెడ్డి చైతన్య స్కూల్ చంద్రగిరి ప్రిన్సిపాల్ సురేష్, ఎన్ఆర్ఐ అకాడమీ సిబ్బంది సుధాకర్, తిరుపతి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ఆరిఫ్, చైతన్య స్కూల్ తిరుపతి డీన్ మోహన్, జీడీ నెల్లూరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పవన్, సోముకు బెయిల్ మంజూరు చేశారు.
పది ప్రశ్నాపత్రాల లీకు కేసులో ఏడుగురికి బెయిలు - Bail sanction in Tenth Paper leakage case
Bail sanction in Tenth Paper leakage case : పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ చిత్తూరు నాలుగవ అదనపు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Bail sanction in Tenth Paper leakage case