అష్టాదశ పురాణాలను తెలుగులో అనువాదం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని.. తితిదై జేఈఓ సదా భార్గవి.. పండితులను కోరారు. తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో అష్టాదశ పురాణాలను అనువదిస్తున్న పండితులతో తిరుపతిలోని శ్వేత భవనంలో జేఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పండితులకు సూచించారు.
అగ్ని పురాణంతో పాటు విష్ణు పురాణం, బ్రహ్మ పురాణంలోని రెండు భాగాలను పరిష్కరించాలన్నారు. మత్స్య పురాణ ముద్రణను పూర్తి చేసి త్వరగా ఆవిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి దక్షిణమూర్తి శర్మ, శ్వేత డైరెక్టర్ డా.రామానుజుల రెడ్డి పాల్గొన్నారు.