ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రావాలని శ్రీవారిని వేడుకున్నా: ఏపీఎన్జీవో అధ్యక్షుడు - ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు

ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూడాల్సి వస్తోందన్నారు.

APNGO president bandi srinivas rao
APNGO president bandi srinivas rao

By

Published : Jul 29, 2021, 2:52 PM IST

ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు జగన్‌ ఎన్నో హామీలిచ్చారని.. ఎన్నికల హామీలతో ఉద్యోగుల ఓట్లు వైకాపా దోచుకుందన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు ఆలస్యంగా ఇస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని బండి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు... ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారని.., కూరగాయలు, పాల వారి దగ్గర చులకన భావన ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు..సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దేవుడ్ని వేడుకున్నట్లు బండి శ్రీనివాసరావు చెప్పారు. అనంతరం తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు.

'కుటుంబాలను వదిలి పనిచేస్తున్నా సీఎంకు కనికరం లేదు. పీఆర్సీ కోసం ఆశతో ఎదురుచూస్తున్నాం. ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీ వెంటనే నివేదిక ఇవ్వాలి.'- ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

ఇదీ చదవండి:

Jagananna vidya deevena: 'ప్రభుత్వం తరఫున.. విద్యార్థులకు ఇవ్వగలిగిన ఆస్తి చదువే..'

ABOUT THE AUTHOR

...view details