ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేత - చిత్తూరు జిల్లా న్యూస్ అప్​డేట్స్

తిరుపతిలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున ఇళ్ల స్థలాల పట్టాలు అందించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి లబ్దిదారులకు పత్రాలను అందించారు.

mla
mla

By

Published : May 19, 2021, 10:02 AM IST

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ. 91 వేల కోట్లు.. సంక్షేమ కార్యక్రమాలకు సీఎం జగన్ వెచ్చించారని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున ఇళ్ల స్థలాల పట్టాలను అందించే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, నగర పాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఏర్పేడు మండలం వికృతమాలలో నిర్మించిన గృహ సముదాయంలో తిరుపతిలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తూ.. పత్రాలను, ఇంటి తాళాలను అందించారు. ఓటు తమ పార్టీకి వేశారా లేదనేది పట్టించుకోకుండా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details