సాంకేతికంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు జాతీయస్థాయి విద్యాసంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. తిరుపతిలో నిర్వహిస్తున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ రెండో రోజు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ - ఐఐడీటీ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
ఒప్పంద పత్రాలపై డీజీపీ గౌతం సవాంగ్, ఐఐడీటీ జీఎం మల్లికార్జున్రెడ్డి, రాష్ట్రనైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ రామకోటిరెడ్డి సంతకాలు చేశారు. డిజిటల్ టెక్నాలజీ, సైబర్ భద్రత అంశాలపై సహకారంతో పాటు...యువతను ఉపాధి దిశగా నడిపించేలా శిక్షణను అందించే విధంగా సహాయ సహకారాలను తీసుకోనున్నట్లు డీజీపీ సవాంగ్ వెల్లడించారు.