ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD Board Members Case: 'స్టే' ఉన్నప్పుడు ఆర్డినెన్స్‌ ఎలా తీసుకొచ్చారు: హైకోర్టు

ttd board members case: తితిదే ప్రత్యేక ఆహ్వానితులపై ఆర్డినెన్స్ ఎలా తెస్తారని..? హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై కోర్టులో కేసు ఉండగా.. ఆర్డినెన్స్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. విచారణను మార్చి 11కు వాయిదా వేసింది.

Andhra Pradesh High Court
Andhra Pradesh High Court

By

Published : Feb 28, 2022, 12:37 PM IST

Updated : Mar 1, 2022, 3:47 AM IST

ttd board members case:హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి, బోర్డుకి ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని సర్కార్‌ తెలిపింది. తితిదేకి, బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితులను నియమించేందుకు వీలుకల్పిస్తూ దేవాదాయ చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలుచేస్తూ... వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

అత్యవసరంగా ఆర్డినెన్స్ తేవాల్సిన పరిస్థితులేమీలేవని పిటిషనర్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ వాదించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఇచ్చిన జీవోలపై గతేడాది సెప్టెంబర్‌లో హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఆ ఉత్తర్వులను బైపాస్ చేసి... ప్రత్యేక ఆహ్వానితులను నియమించుకునేందుకు హడావుడిగా ఆర్డినెన్స్ తెచ్చారని వాదించారు. ఏజీ స్పందిస్తూ... హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని... పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. తుది తీర్పు ఇచ్చేవరకు.... మధ్యంతర ఉత్తర్వులకు లోబడి ఉంటామన్నారు. ఏజీ వాదనను నమోదు చేసిన హైకోర్టు..విచారణను మార్చి11కు వాయిదా వేసింది.

Last Updated : Mar 1, 2022, 3:47 AM IST

ABOUT THE AUTHOR

...view details