ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో పూజా కార్యక్రమాలపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు అభ్యంతరం - తిరుమల తిరుపతి దేవస్థానం తాజా వార్తలు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో పూజా కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా నిబంధనలను పాటించడం లేదని పేర్కొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. మన దేవుళ్లను మనమే నిందించుకుంటున్నాం అని పేర్కొంది. దేవుడ్ని కించపరిచేలా ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేయడం ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

ap high court comments on ttd declaration
ap high court comments on ttd declaration

By

Published : Nov 10, 2020, 8:35 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం .. శ్రీవారి ఆలయంలో పూజా కార్యక్రమాల నిర్వహణలో నిబంధనలను పాటించడం లేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. దేవుణ్ని కించపరిచేలా ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేయడం ఏమిటని పిటిషనరును ప్రశ్నించింది. దేవుళ్లను మనమే నిందించుకుంటున్నామని వ్యాఖ్యానించింది. శ్రీవారి పూజా కార్యక్రమాల విషయంలో జోక్యం చేసుకోలేమని మౌఖికంగా తెలిపింది. వ్యాజ్యంలో కౌంటర్‌ వేయాలని తితిదేను ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఆగమశాస్త్ర నిబంధనలు పాటించేలా, హిందూయేతరుల నుంచి డిక్లరేషన్‌ తీసుకునేలా తితిదే ఈవోను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా హైకోర్టులో ఈ పిల్‌ దాఖలు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details