తెదేపా ఏనాడు ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టలేదని అచ్చెన్నాయుడు అన్నారు. కక్షసాధింపులు తెదేపాను ఏంచేయలేవుని అన్నారు. రెండేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని.. అభివృద్ధి కంటే ప్రచారం కోసమే ఎక్కువ ఖర్చు పెట్టారని ఆక్షేపించారు. తిరుపతిలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
'ఆ వీడియోలు పంపిస్తే... రూ.10 వేలు పారితోషికం ఇస్తాం' - వైకాపా ప్రభుత్వంపా సీఎం జగన్ వ్యాఖ్యలు
తిరుపతిలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వైకాపా వాలంటీర్లతో భయపెట్టి ఓట్లు వేయించుకుంటుందని ఆరోపించారు. పథకాలు ఆపుతామని వాలంటీర్లు బెదిరిస్తే రికార్డు చేయాలని.. ఆ వీడియో పంపిస్తే రూ.10 వేలు పారితోషికం ఇస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.
tdp leader achennaidu
వైకాపా ప్రభుత్వం ఇసుకపై రూ.5 వేల కోట్ల దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. తిరుపతి పవిత్రతను కాపాడాలంటే వైకాపాను ఓడించాలని అన్నారు. వాలంటీర్లతో భయపెట్టి ఓట్లు వేయించుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పథకాలు ఆపుతామని వాలంటీర్లు బెదిరిస్తే రికార్డు చేయాలని పిలుపునిచ్చారు. రికార్డు చేసి పంపిస్తే రూ.10 వేలు పారితోషికం ఇస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఇదీ చదవండి: పకోడి బండి వద్ద వివాదం.. బాలుడి మృతి