నాలుగు రోజులపాటు జలదిగ్బంధంలో ఉన్న తిరుపతి శ్రీ కృష్ణా నగర్‌లో ఓ వింత చోటుచేసుకుంది. భూమి లోపల పాతిపెట్టిన నీటి ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా భూమి ఉపరితలం పైకి ఎగసి(TANK RAISED FROM GROUND IN TIRUPATI) వచ్చింది. దాదాపు 25 అడుగుల విస్తీర్ణంతో 25 సిమెంట్ ఒరలతో నిర్మించిన నీటి తొట్టె బయటపడటం ఆసక్తికరంగా మారింది. నీటి తొట్టిలోకి దిగి మహిళ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
శుభ్రం చేస్తున్న సమయంలో సిమెంటు ఒరలు ఉబికి రావడంతో ఆందోళనకు గురైన మహిళ నీటి తొట్టెలో పడిపోయారు. వెంటనే ఆమెను నిచ్చెన సాయంతో బయటకు తీశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నీరు ప్రవహించడంతో ట్యాంక్ కోసం ఏర్పాటు చేసిన సిమెంటు ఒరలు 18 పైకి ఊబికి వచ్చినట్లు భావిస్తున్నారు.