ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM

.

5pm_Topnews
ప్రధాన వార్తలు @ 5pm

By

Published : Apr 10, 2021, 5:00 PM IST

  • ప్రచార సభ రద్దు
    ముఖ్యమంత్రి జగన్‌ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'విజయం మీ వల్లే సాధ్యం'
    నెల్లూరులో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో తెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచార వ్యూహంపై చర్చించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నిరసన హోరు
    రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, రైతులు చేస్తున్న ఆందోళనలు 480వ రోజు కొనసాగాయి. మందడంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళలు, రైతులు పొంగళ్లు సమర్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఏం జరిగింది..?
    విజయవాడ శ్రీనగర్​ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తండ్రీ కుమార్తె ఉరివేసుకుని.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ వైపు ఆత్మహత్య లేఖ ఉన్నట్లు సమాచారం. మరోవైపు తండ్రి కాళ్లు, చేతులు కట్టేసి.. నోటికి టేప్ వేసి ఉంది. ఇంతకీ అది ఆత్మహత్యా? హత్యా? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ​ షా రాజీనామాకు డిమాండ్​
    బంగాల్​లో ఎన్నికల వేళ జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్​ షా రాజీనామా చేయాలన్నారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. ఆత్మరక్షణ కోసమే సీఐఎస్​ఎఫ్​ కాల్పులు జరిపిందన్న ఎన్నికల సంఘం ప్రకటనను తప్పుపట్టారు. ప్రజలు శాంతియుతంగా పోలింగ్​లో పాల్గొని ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బంగాల్​లో ఉద్రిక్తత
    బంగాల్​ కూచ్​బెహార్​ జిల్లాలోని పోలింగ్​ కేంద్రం నెం.126 వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. అక్కడ పోలింగ్​ను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు ఈ ఘటనపై తమకు పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని ఆదేశించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వేధిస్తోన్న కొరత
    ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా కొరత ఏర్పడిన నేపథ్యంలో పేద దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆయా దేశాల్లో మొదటి డోసు తీసుకుని.. రెండో డోసు కోసం ఎదురుచూస్తోన్న వారికి టీకా అందుతుందో లేదోనని ఆందోళన నెలకొంది. భారత్​ నుంచి తక్కువ డోసులు అందుతుండటం పరిస్థితులను మరింత క్లిష్టంగా మారుస్తోందని నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ధర ఎంతంటే..
    చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షియోమీ ఎంఐ11 సిరీస్​లో సరికొత్త స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటివరకు విడుదల అయిన వాటిలో ఈ ఫోన్​నే టాప్​ ఎండ్​ కావడం విశేషం. ఎంఐ 11 ఆల్ట్రా పేరుతో వస్తున్న ఈ ఫోన్​లో ఉండే ఫీచర్లు, దాని ధర గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బిజీబిజీ
    ఐపీఎల్​ రెండో మ్యాచ్​లో తలపడేందుకు సిద్ధమయ్యాయి చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్. ఈ క్రమంలోనే ఇరుజట్లు ప్రాక్టీస్​లో బిజీ అయ్యాయి. చెన్నై సారథి ధోనీ కూడా నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ఫ్రాంచైజీ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • చిరు విషెస్
    పవన్​కల్యాణ్​ 'వకీల్​సాబ్'​.. ప్రస్తుతం పాజిటివ్​ టాక్​తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్​, నిర్మాత్​ దిల్​రాజును కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మెగాస్టార్​ చిరంజీవి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details