- NTR BHAVAN: ఎన్టీఆర్ భవన్ పై దాడి ఘటనలో నిందితుల అరెస్టు.. ఎంత మంది అంటే?
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మీడియాలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా.. అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ARREST: పట్టాభి నివాసంపై దాడి కేసులో 11 మంది అరెస్టు
పట్టాభిరాం నివాసంపై జరిగిన దాడి ఘటనలో 11 మందిని అరెస్టు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో విజయవాడ గుణదల, క్రీస్తురాజపురం, బావాజీపేట, ఉడ్‌పేట, సీతారామపురం వాసులున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Minister Kannababu: సీఎంపై బురద జల్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన: కన్నబాబు
తెదేపా చేపట్టిన 36 గంటల దీక్షలో.. పార్టీ నేతల చేత సీఎంను తిట్టించారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో తెదేపా అశాంతి సృష్టించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై బురద జల్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన అని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- OTS SCHEME: ఓటీఎస్ పథకం.. లబ్ధిదారులపై ఒత్తిడి లేదంటున్న ప్రభుత్వం
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం పొంది వివిధ గృహ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు వర్తింపజేస్తున్న ఓటీఎస్ పథకాన్ని స్వచ్ఛంద విధానంలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'గోవాలో డబుల్ ఇంజన్ వేగంతో అభివృద్ధి పరుగులు'
గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఆత్మనిర్భర భారత్ స్వయంపూర్ణ గోవా' అనే కార్యక్రమ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలను గోవా ప్రభుత్వం నూటికి నూరు శాతం అమలు చేస్తోందని కితాబిచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చదువుకునేందుకు డబ్బులు లేకే చనిపోతున్నా..