ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM - ఆంధ్రప్రదేశ్ నేటి వార్తలు

.

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Mar 3, 2021, 3:00 PM IST

  • ఎస్ఈసీ కీలక ఆదేశాలు
    మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణపై ఎస్​ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపసంహరణ నోటీసులను యాంత్రికంగా అనుమతించవద్దని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • గ్రామ బహిష్కరణ
    తూర్పుగోదావరి జిల్లా కాజులూరు గుత్తులవారిపేటలో సాంఘిక బహిష్కరణ వెలుగులోకి వచ్చింది. పది కుటుంబాలను గ్రామ పెద్దలు బహిష్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పిన వారికి ఓటు వేయలేదని బహిష్కరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది?: సీపీఐ రామకృష్ణ
    కడప నగరంలోని 19వ వార్డులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. పార్టీ అభ్యర్థిని హేమలత తరఫున ప్రచారం చేపట్టారు. పులివెందులలోని అన్ని వార్డులు వైకాపా ఏకగ్రీవం చేసుకుంటే.. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రాజీనామా
    లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోళి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించాలని కోరుతూ సంబంధిత లేఖను సీఎం యడియూరప్ప గవర్నర్​కు పంపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సంరక్షణా సందేశం
    మార్చి 3 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశా పూరీ బీచ్​లో ప్రఖ్యాత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. అంతరించిపోతున్న జంతువులపై అవగాహన పెంచుతూ తీర్చిదిద్దిన ఈ శిల్పం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఊహించని ట్విస్ట్​!
    అమెరికాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎస్​యూవీలో 25 మంది ప్రయాణికులు ఉండటం.. మృతుల్లో ఎక్కువ మంది మెక్సికోకి చెందినవారే కావడం అనుమానాలు రేకిత్తుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఎక్కువ ఉంటే నష్టాలివే...
    ప్రస్తుతం చాలా మంది వివిధ అవసరాలకు వేర్వేరుగా బ్యాంక్ ఖాతాలను వినియోగించడం సర్వ సాధారణమైంది. పెట్టుబడుల కోసం ఒకటి, సాధారణ లావాదేవీలకు మరొకటి, వేతన ఖాతా.. ఇలా ఎక్కువ బ్యాంక్​ ఖాతాలు వాడటం ఎంత వరకు సురక్షితం? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఖరీదైన ఫ్లాట్​!
    ఆదిపురుష్' షూటింగ్ కోసం ముంబయిలో కొన్నాళ్లు ఉండనున్న ప్రభాస్.. సొంతంగా విలాసవంతమైన ఫ్లాట్​ కొనుగోలు చేయనున్నారట. ప్రస్తుతం దానిని వెతికేపనిలో ఆయన బృందం ఉంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details