మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. తిరుపతి అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఎస్వీ వర్సిటీ నుంచి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకూ సాగిన 2కే రన్‌ను అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలకు ఉన్న హక్కులపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ఎస్పీ వివరించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా.. తిరుపతిలో 2కే రన్ - తిరుపతి వార్తలు
తిరుపతి అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీసులు పాల్గొన్నారు. విజేతలకు అర్బన్ ఎస్పీ బహుమతులు ప్రదానం చేశారు.
తిరుపతిలో 2కే రన్