- అమరావతి పాదయాత్రపై లాఠీఛార్జ్.. విరిగిన రైతు చేయి!
ప్రకాశం జిల్లా చదలవాడలో రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- RAINS: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావతంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(heavy rains in state) కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఈదురు చలి గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు జిల్లా అధికారులు సెలవు ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 2 గంటల్లో పెళ్లి.. చెప్పులు వేసుకొస్తానని చెప్పి..
మరో రెండు గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ మండపం ఒక్కసారిగా మూగబోయింది. వరుడు కనిపించడం లేదంటూ కుటుంబీకులు చెప్పడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Pushpayagam: తిరుమలలో వైభవంగా పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ(srivari Pushpayagam at tirumala) మహోత్సవాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు.. ఏడు టన్నుల పూలతో "పుష్ప కైంకర్యం"(pushpa kainkaryam) నిర్వహించున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎడతెరపి లేని వర్షాలు- జలదిగ్బంధంలోనే చెన్నై నగరం
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. సాధారణ జనజీవనం స్తంభించింది. చెన్నైలో పలు కాలనీలు, ఆస్పత్రులు నీటిమయమయ్యాయి. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రాష్ట్రపతితో గవర్నర్ల సమావేశం- మోదీ హాజరు
గవర్నర్ల 51వ సమావేశం దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇండోనేసియాలో భారీ భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత
ఇండోనేసియాలో భారీ భూకంపం(earthquake indonesia) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రూ.50 వేలు దాటిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..
బంగారం (Gold Price today), వెండి ధరలు గురువారం భారీగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.780, కిలో వెండిపై ఏకంగా రూ.1,238 పెరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పాకిస్థాన్ ఫేవరెట్.. ఆసీస్‌తో ప్రమాదమే'
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) సెమీఫైనల్లో భాగంగా నేడు (నవంబర్ 11) ఆస్ట్రేలియాతో తలపడనుంది పాకిస్థాన్(pak vs aus t20). ఈ మ్యాచ్‌పై స్పందించిన టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(robin uthappa news).. ఇందులో గెలిచే అవకాశం పాక్‌కే ఎక్కువగా ఉందని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రభాస్ హీరోయిన్గా కొరియన్ భామ.. నిజమెంత?
ప్రభాస్ 'స్పిరిట్'(spirit movie prabhas heroine) సినిమాలో దక్షిణకొరియా భామ సాంగ్ హై కో నటించనుందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ నటించట్లేదని సినీవర్గాల టాక్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.