బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు, పార్టీ నాయకులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహంచారు. ఉత్సాహంతో కదం తొక్కండి-ఉద్ధృతంగా ప్రచారం చేయండంటూ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు 24 రోజులే సమయం ఉందని ... విశ్రాంతి లేకుండా పనిచేయాలని ఆదేశించారు. ప్రజల్లో పరపతి లేనివాళ్లు, స్వలాభం కోసం పార్టీలోకి వచ్చినవాళ్లే తెదేపాను వీడుతున్నారని విమర్శించారు. సామాజిక న్యాయం కోసమే కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని ఉద్ఘాటించారు.
దృష్టి మరల్చుతారు