ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM

.

TOP NEWS
TOP NEWS

By

Published : Nov 18, 2021, 6:59 PM IST

  • Weather Updates: అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు.. రేపు తీరం దాటే అవకాశం
    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య చెన్నై సమీపంలో రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Rains: చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు
    చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరుమల (Rains in tirumala) కనుమ దారిలో కొండచరియలు పడ్డాయి. అప్రమత్తమైన తితిదే (TTD) అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు.. పాపవినాశనం రహదారిని మూసివేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Parishad Elections: పరిషత్ ఎన్నికల ఫలితాల్లోనూ వైకాపా అరాచకాలు: చంద్రబాబు
    పరిషత్ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార వైకాపా అరాచకాలకు పాల్పడిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశం అభ్యర్థులు గెలిచిన చోట్ల వైకాపా తన అధికారం బలంతో రీ కౌంటింగ్​కు పాల్పడిందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా కేసులు.. ఇద్దరు మృతి
    రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారినపడి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 2,560 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సైనిక చర్చల్లో భారత్​- చైనా కీలక నిర్ణయం!
    వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనపై చైనా సైన్యంతో చర్చలు జరిపినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. 14వ విడత సీనియర్ కమాండర్ల భేటీ త్వరగానే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తమిళనాడులో భారీ వర్షాలు- తీర ప్రాంతాలకు రెడ్​ అలర్ట్​
    తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంత జిల్లాలకు రెడ్​ అలర్ట్​ ప్రకటించింది వాతావరణ శాఖ. పుదుచ్చేరిలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నలుగురు బాలికలపై రేప్.. దోషిగా తేలినా జైలుశిక్ష లేదు!
    నలుగురు బాలికలపై అత్యాచారం చేసి, దోషిగా తేలిన ఓ యువకుడు ఎలాంటి జైలు శిక్ష లేకుండానే బయటపడ్డాడు. దోషికి ఎనిమిదేళ్ల ప్రొబేషన్ విధించిన కోర్టు.. జైలులో ఉండాల్సిన అవసరం లేదని తేల్చింది. అసలు ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆ విమానాలు పూర్తిస్థాయిలో నడవడం ఇప్పట్లో కష్టమే!'
    అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. అయితే, ఇప్పట్లో ఇది సాధారణ స్థితికి చేరే అవకాశాలు లేవని సంకేతాలిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆర్​ఆర్​ఆర్'​ కౌంట్​డౌన్​.. మరో 50 రోజులు మాత్రమే
    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా మరో 50రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పోస్ట్​ చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వివాహ బంధంలోకి అడుగు పెట్టిన హీరోయిన్‌
    నటి శ్రద్ధా ఆర్య వివాహబంధంలోకి అడుగుపెట్టారు. దిల్లీకి చెందిన నావికదళ అధికారి రాహుల్‌ శర్మను ఆమె పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు శ్రద్ధా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details