ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 8, 2020, 5:40 PM IST

ETV Bharat / city

ఫ్లైఓవర్లు నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించిన ఎంపీ భరత్

జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్​లు నిర్మించనున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ సురేంద్ర నాథ్, సీజీఎం(ఆర్ఓ) ఆర్కే సింగ్ తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణాలు మరింత వేగంగా జరిగేందుకు, ముఖ్య కూడళ్లలో ప్రమాదాలు నివారించేందుకే ఈ నిర్ణయమని వివరించారు.

MP Margani bharat
ఫ్లైఓవర్ నిర్మించే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఎంపీ భరత్

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ సెంటర్ వద్ద గౌతమీ బ్రిడ్జికి అనుసంధానం చేస్తూ… జాతీయ రహదారిపై త్రీ స్పేస్ (మూడు కానాలు) నిర్మించే ఫ్లైఓవర్ల ప్రదేశాన్ని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ పరిశీలించారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఆయన వెంట ఉన్నారు.

నిర్మాణ పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్​హెచ్ పీడీ సురేంద్రనాథ్, సీజీఎం ఆర్కే సింగ్ మాట్లాడుతూ… ఇప్పటికే ఈ ప్రదేశంలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి సర్వే పూర్తయిందని వివరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మరో కొన్ని రోజుల్లో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. నిర్మాణం పూర్తయితే… ఈ ప్రాంతంలో ప్రమాదాలను నివారించవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details