వరదలు ప్రారంభానికి ముందే పోలవరం నిర్వాసితులను తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. నిర్వాసితుల కోసం..తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం కృష్ణుని పాలెం, దేవీపట్నం మండలం ముసిని గుంట, గుబ్బల పాలెంలలో నిర్మించిన పునరావాస కాలనీలను ఆయన సందర్శించారు.
జూలై నెలాఖరుకు సుమారు 17వేల నిర్వాసిత కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న సుమారు లక్షా 17వేల కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పిస్తామన్నారు. రూ 50 వేల కోట్లకు 17వేల కోట్లు ఖర్చు చేసినా.. గత ప్రభుత్వం... 70 శాతం పనులు తామే పూర్తిచేశామని తప్పుడు లెక్కలు చెప్పిందని విమర్శించారు. పోలవరం పునరావాస కాలనీ పనులు యాభైశాతం పూర్తి అయినట్లు తెలిపారు. కరోనా కారణంగా కూలీల కొరత ఏర్పడిందన్నారు.