RRR Movie: తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో శ్రీపద్మ పిక్చర్ ప్యాలెస్లో తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అభిమానుల కోసం బెనిఫిట్ షో వేశారు. ఈ సందర్భంగా.. థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన హీరోల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
RRR Movie: యానాంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించిన హీరో కార్తికేయ - యానాంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించిన హీరో కార్తికేయ
RRR Movie: రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని.. ఆర్ఎక్స్100 ఫేమ్ కార్తికేయ, జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ యానాంలో తిలకించారు.
యానాంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించిన హీరో కార్తికేయ
"మేము కలిసే ఉంటాము.. మా అభిమానులైన మీరూ కలిసే ఉండాలి" అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందర్నీ ఆకట్టుకుంది. కాగా.. గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ కోసం వచ్చిన ఆర్ఎక్స్100 కథానాయకుడు కార్తికేయ, జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ సైతం ఈ థియేటర్లో సినిమా చూశారు. ప్రేక్షకులకు ఎవరికీ తెలియకుండా వచ్చి RRR సినిమాను చూసి, అభిమానుల కంటపడకుండా ప్రత్యేక ద్వారం ద్వారా బయటికి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: "వికేంద్రీకరణతో.. విద్వేష రాజకీయాలు చేస్తున్నారు"