కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. వైకాపా అసమర్థ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు లేక కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద భారీగా నిధులున్నా కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆక్షేపించారు. మంత్రులు అంకెల గారడీకి అలవాటు పడ్డారన్నారు. ప్రభుత్వానికి పేదల ఆకలి కేకలు వినపడవా అని గోరంట్ల నిలదీశారు.
'కరోనా లెక్కల్లోనూ అంకెల గారడీ' - లాక్డౌన్ వల్ల రైతులు ఇబ్బందులు
కార్మికుల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసిందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహించారు. ప్రభుత్వానికి పేదల ఆకలి కేకలు పట్టడం లేదన్నారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు