ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా నియంత్రణకు విస్తృత చర్యలు : డా.రమేష్ కుమార్ - latest updates of corona cases

తూర్పు గోదావరి జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం వల్ల వైద్య సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. అనుమానితుల సంఖ్య పెరుగుతున్న కారణంగా వైద్య సేవలు విస్తృతం చేశారు. అందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రమేష్ కిషోర్ ఈటీవీ భారత్​కు వివరించారు.

eastgodavari officials on corona cases in district
eastgodavari officials on corona cases in district

By

Published : Mar 30, 2020, 11:40 PM IST

ఈటీవీ భారత్ తో డా.రమేష్ కుమార్

కరోనా వైరస్ నియంత్రణపై వైద్య సిబ్బంది అప్రమత్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చర్యలను చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినందున జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి నిర్థరణ పరీక్షలకు పంపామని జిల్లా ఆస్పత్రులు అధికారి డా.రమేష్ కిషోర్ తెలిపారు. కరోనా సోకిన ఇద్దరిలో ఒకరు కోలుకుంటున్నారని చెప్పారు. అయితే బాధితుల కుటుంబ సభ్యులను రాజమహేంద్రవరంలోని జిల్లా ఆస్పత్రిలో ఉంచామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details