- 'వాలంటీర్లను దూరంగా ఉంచాలి'
రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థి, పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు వ్యవహారించొద్దని... పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నేతలతో సమావేశం...
విశాఖలో పార్టీ నేతలతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను రేపు విడుదల చేయాలని నిర్ణయించారు. మరోవైపు అధిక సంఖ్యలో అశావహులు వినతిపత్రాలు సమర్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'దుకాణం కూల్చివేశారు'
నామినేషన్ను ఉపసంహరించుకోలేదనే కారణంతోనే తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి దుకాణాన్ని కూల్చివేశారని మాజీఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. అధికార పార్టీ దౌర్జన్యాలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రాజకీయాల అడ్డాలో ఒకప్పుడు ఆ పార్టీలు చక్రం తిప్పాయి.. మరి ఇప్పుడు..?
అక్కడ ఒకప్పుడు చక్రం తిప్పిన పార్టీలు.. ఇప్పుడు ప్రాభవం కోల్పోయాయి. డివిజన్లలో నిలబడితే చాలు గెలుపు దిశగా దూసుకెళ్లే పార్టీలు.. ఉనికి కోల్పోయాయి. ఒకప్పుడు సునాయసంగా మేయర్ పీఠం దక్కించుకుని.. తర్వాతి కాలంలో ఆ జోరు చూపించలేకపోయాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'బంగాల్లో హంగ్ వస్తే భాజపాతో మమత పొత్తు'
బంగాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి పావులు కదుపుతోంది. ఈ మేరకు వామపక్షాలు సహా.. ఇతర పార్టీలతో కలసి కోల్కత్తాలో 'పీపుల్స్ బ్రిగేడ్' పేరిట నిర్వహించిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసి తమ బల ప్రదర్శనకు తెరతీసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఎర్రకోట ఘటనకు భాజపానే కారణం'