- పిండ ప్రదానానికి వెళ్లి.. పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిండ ప్రదానానికి వెళ్లిన ఏడుగురు కుటుంబ సభ్యులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జనభేరి...అమరావతి ఉద్యమ స్ఫూర్తితో మారుమోగి
రాయపూడి వేదికగా అమరావతి ఐకాస నిర్వహించిన సభ... రాజధాని రైతుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏడాది కాలంగా ఎన్నో ఆటుపోట్లతో రాజధాని కోసం పోరాడుతున్న వారికి లక్ష్యం చేరుకోగలమనే విశ్వాసం కలిగించింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇలా అనుమానిస్తుంటే.. వ్యవస్థలు పని చేయలేవు: హైకోర్టు
పోలీసుల చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ పిటిషన్లపై విచారణ నుంచి జస్టిస్ రాకేశ్ కుమార్ తప్పుకోవాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు పదేపదే విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను తప్పుబట్టిన కేంద్రం
రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌పై రాష్ట్ర వైఖరిని కేంద్రం తప్పుబట్టింది. డీపీఆర్‌లో ప్రాథమిక అంశాలు లేవని కేంద్ర జలశక్తిశాఖ తెలిపింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు డీపీఆర్ రూపొందించాలని సూచించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- టీఎంసీకి షాక్- సువేందు దారిలోనే మరో ఇద్దరు
బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార టీఎంసీకి షాక్ ఇస్తున్నారు నేతలు. ఇప్పటికే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకున్న సువేందు అధికారి తాజాగా పార్టీ సభ్యత్వంతో ఇతర పదవులకు రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు నాయకులు కీలక పదవుల నుంచి తప్పుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పీఎం కేర్స్ ఫండ్ పారదర్శకతకో నమస్తే'
కరోనా నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి కేంద్రం పొందిన 'పీఎం కేర్స్ విరాళాలపై' కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. పీఎం కేర్స్‌పై వచ్చిన ఓ వార్త ఆధారంగా పీఎం కేర్స్ పారదర్శకతకు నమస్తే అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఒబామా పుస్తకం రికార్డ్- నెల రోజుల్లోనే 33లక్షల అమ్మకాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రచించిన 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్' రికార్డు స్థాయి అమ్మకాలను సాధిస్తోంది. ప్రచురితమైన నెల రోజుల్లోనే 33లక్షలకు పైగా కాపీల అమ్మకాలతో బెస్ట్ సెల్లర్‌గా దూసుకుపోతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మరింత ప్రియమైన బంగారం, వెండి
పసిడి, వెండి ధరలు గురువారం పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర మళ్లీ రూ.49,500లకు చేరువైంది. వెండి ధర కిలోకు ఏకంగా దాదాపు రూ.12 వందలు పెరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'నయా వాల్' నయా రికార్డు.. కోహ్లీని వెనక్కినెట్టి!
టీమ్ఇండియా క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా ఓ రికార్డులో సారథి కోహ్లీని అధిగమించాడు. గత పదేళ్లలో ఆస్ట్రేలియాపై అత్యధిక బంతులను ఎదుర్కొన్న బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మొత్తంగా ఆసీస్‌పై ఆడిన 28 ఇన్నింగ్స్‌ల్లో 3,609 బంతులను ఆడాడు నయా వాల్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సిబ్బందిని తిట్టిన హీరో.. తప్పుకున్న ఐదుగురు!
హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కొత్త సినిమా నుంచి ఈ మధ్య ఏడుగురు సిబ్బంది తప్పుకున్నారు. సెట్లో వారిని టామ్ తిట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.