ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుక అక్రమ తరలింపు... అడ్డుకున్న వారిపై వైకాపా నేత దౌర్జన్యం - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

Lllegal sand transport: వైకాపా నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇసుక రీచ్​ల నుంచి యథేచ్చగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది గమనించిన స్థానికులు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లకు అడ్డుపడ్డారు. రోడ్డుపై అడ్డంగా పడుకుని ఆందోళనకు దిగారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావు పాలెంలో జరిగింది.

Lllegal sand transport
ఆందోళన

By

Published : Oct 3, 2022, 6:06 PM IST

Lllegal sand transport: ప్రభుత్వ భవానాల పేరుతో రెండు రోజుల నుంచి ఇసుక రీచ్ నుంచి వైకాపా నేతలు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆందోళన చేపట్టారు. ట్రాక్టర్ టైర్లకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. దీంతో స్థానికులపై వైకాపా నాయకులు దౌర్జన్యానికి తెగబడిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం ఇసుక రీచ్ దగ్గర జరిగింది.

ప్రభుత్వ భవన నిర్మాణాల పేరుతో ఇసుకను బయట ప్రాంతాలకు తరలించి వైకాపా నేత పేమ్మసాని శ్రీనివాసులు నాయుడు అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. ఆందోళనకు దిగిన వారిపై పెమ్మసాని వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. సెబ్ అధికారులకు సమాచారమిచ్చినా.. అధికార పార్టీ నేతల ట్రాక్టర్లు కావడంతో విడిచిపెట్టారని స్థానికులు వాపోయారు.

ఇసుక అక్రమ తరలింపు.. అడ్డుకున్నవారిపై దౌర్జన్యం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details