ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ప్రభావం: షార్​లో పనులు నిలిపివేత

కరోనా వ్యాప్తి కారణంగా నెల్లూరు జిల్లాలోని షార్​లో పనులన్నీ నిలిపివేశారు. కీలక విభాగాల్లో 50 శాతం కంటే తక్కువ సిబ్బందితో విధులు నిర్వహించాలని నిర్ణయించారు.

shar
షార్​లో పనులు నిలిపివేత

By

Published : Apr 27, 2021, 10:19 AM IST

నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో పనులన్నీ నిలిపివేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. షార్‌, ఉద్యోగుల నివాస కాలనీల్లో కొవిడ్‌ విజృంభిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర సర్వీసులు మినహా.. అన్నింటికీ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. షార్‌, ఉద్యోగుల కాలనీల్లో సుమారు 700 మంది కరోనా బారినపడ్డారు. మరణాలు కూడా ఉన్నాయి. దీంతో సంచాలకులు ఆర్‌. రాజరాజన్‌, నియంత్రణాధికారి శ్రీనివాసులురెడ్డి, ఇతర అధికారులు సమావేశమై.. యూనియన్‌ నాయకులు వినతి మేరకు మే ఒకటో తేదీ వరకు పనులన్నీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

గగన్‌యాన్‌ ప్రాజెక్టు, జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ అనుసంధానం తదితర కీలక విభాగాల్లో 50% మంది కన్నా.. తక్కువ హాజరుతో విధులు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి:రాష్ట్రానికి పొంచి ఉన్న ఆక్సిజన్ సమస్య!

ABOUT THE AUTHOR

...view details