చెట్లు కత్తిరించే యంత్రం ప్రారంభం భారీ వృక్షాలను కత్తిరించే అధునాతన ట్రిమ్మింగ్ మిషన్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. నగరంలోని మినీ బైపాస్ రోడ్డు వద్ద యంత్రాన్ని మొదలుపెట్టారు. కొంత సమయం మంత్రి చెట్ల కొమ్మలను కత్తిరించారు. స్వచ్ఛాంధ్ర మిషన్ లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే మరిన్ని యంత్రాలను తీసుకువస్తామని ప్రకటించారు.