- AP Cabinet meet: ఈ నెల 17న కేబినెట్ సమావేశం..అసెంబ్లీ సమావేశాలపై చర్చ
ఈ నెల 17వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP cabinet) జరగనుంది. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన వివిధ అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రాష్ట్రపతి నేతృత్వంలో గవర్నర్ల సదస్సు..పాల్గొననున్న బిశ్వభూషణ్ హరిచందన్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో జరగనున్న గవర్నర్ల సదస్సుకు హాజరు కానున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Somu Veerraju: 'పెట్రోల్ ధరలు తగ్గించమంటే.. దాడులకు దిగుతారా..?'
పెట్రోల్ ధరలు తగ్గించమంటే.. దాడులకు దిగుతారా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రజలకు ఉపశమనం చేయాలని కోరితే రాద్ధాంతం చేస్తారా అని నిలదీశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- PENSION PROBLEMS: వేళ్లే లేవంటే.. వేలిముద్రలు వేయట్లేదని ఏం చేశారంటే..!
అతని రెండు చేతులకు వేళ్లు లేవు. వృద్ధాప్యం కారణంగా కనుచూపు స్పష్టంగా లేదు. చెవులూ వినపడవు. అలాంటి వృద్ధుడికి 'ఈ కేవైసీ' అవ్వకపోవటంతో... పింఛన్ నిలిపేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'కాంగ్రెస్ అంటే.. ఐ నీడ్ కమీషన్ పార్టీ!'
2007-2012 మధ్య రఫేల్ ఒప్పందం(Rafale Deal News) విషయంలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర(Sambit Patra) ఆరోపించారు. ఫ్రాన్స్ మీడియా ప్రచురించిన కథనమే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఏడు దేశాలతో భారత్ కీలక భేటీ- తాలిబన్లకు సందేశం వెళ్తుందా?
అఫ్గాన్ అంశమే ప్రధాన అజెండాగా రష్యా, ఇరాన్ సహా సెంట్రల్ ఆసియాలోని ఐదు దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం కీలక భేటీ నిర్వహిస్తోంది భారత్(india meet on afghanistan). పాకిస్థాన్, చైనా మాత్రం సమావేశానికి హాజరయ్యేందుకు నిరాకరించాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఐవీఎఫ్‌లో పొరపాటు.. ఒకరి గర్భంలో మరొకరి శిశువు.. పుట్టిన 3 నెలలకు...
ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ విధానంలో పొరపాటు వల్ల ఇద్దరు మహిళలు.. ఇతరుల బిడ్డలకు జన్మనిచ్చారు. కొన్ని రోజుల పాటు చిన్నారులను పెంచిన తర్వాత నిజం (Embryo mix up) తెలుసుకున్నారు. తాజాగా, క్లినిక్ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Gold price today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మంగళవారం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.130 తగ్గింది. పసిడి బాటలో పయనించిన వెండి ధర కిలోకు రూ.53 తగ్గింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'విరాట్ కోహ్లీ స్థానంపై అనుమానాలు వద్దు'
జట్టులోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా.. విరాట్ కోహ్లీ(virat kohli news) స్థానాన్ని భర్తీ చేయలేరని అభిప్రాయపడ్డాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(virender sehwag on kohli). కోహ్లీ బ్యాటింగ్ స్థానంపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చిరు కొత్త సినిమాలో తమన్నా.. ఆసక్తిగా 'అర్జుణ ఫల్గుణ' టీజర్
కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'భోళాశంకర్'లో హీరోయిన్గా తమన్నా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. శ్రీవిష్ణు నటించిన 'అర్జున ఫల్గుణ' టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక రాజ్‌తరుణ్ 'అనుభవించు రాజా' సినిమాలోని ఓ సాంగ్ విడుదలైంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.