ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @9PM

..

By

Published : Sep 12, 2021, 9:01 PM IST

Updated : Sep 12, 2021, 10:47 PM IST

TOP NEWS @9PM
ప్రధాన వార్తలు @9PM

  • ఈ నెల 14 నుంచి 'రైతు కోసం తెలుగుదేశం'
    'రైతు కోసం తెలుగుదేశం' కార్యక్రమం షెడ్యూల్‌లో మార్పు చేశారు. ఈ నెల 13న ప్రారంభం కావాల్సి ఉండగా.. నూతన షెడ్యూల్ ప్రకారం 14 నుంచి నిరసనలు చేపట్టనున్నట్లు తెదేపా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • AKBAR BASHA: సెల్ఫీ వీడియో ఘటన.. రాజీతో సద్దుమణిగిన వివాదం
    రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కడప జిల్లా సెల్ఫీ వీడియో ఘటన రాజీతో సుఖాంతమైంది. భూమిని తిరిగిచ్చేందుకు వైకాపా నేత తిరుపాల్​రెడ్డి కుటుంబం అంగీకరించినట్లు బాధితుడు అక్బర్ బాషా తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,190 కరోనా కేసులు.. 11 మరణాలు
    రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 45,533 మంది నమూనాలు పరీక్షించగా 1,190 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 11 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా 1,226 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Governor: వర్శిటీలు క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు జరపాలి: రాష్ట్ర గవర్నర్‌
    విశ్వవిద్యాలయాలు క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు జరపాలన్నారు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్. కొవిడ్‌కు ముందు 3, 4 ఏళ్లకు ఒకసారి స్నాతకోత్సవాలు జరిపేవారన్న ఆయన.. ఏటా స్నాతకోత్సవాలు జరపాలని గతంలోనే వీసీలకు ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉత్కంఠకు తెర.. గుజరాత్​ సీఎంగా భూపేంద్ర పటేల్
    గుజరాత్​ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్​ను ఎంపిక చేసింది భాజపా(gujarat cm news). విజయ్​ రూపానీ స్థానాన్ని ఆయనతో భర్తీ చేసింది(gujarat bjp news). గాంధీనగర్​లో జరిగిన సమావేశంలో పటేల్​ను శాసనపక్ష నేతగా ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాక్ వక్రబుద్ధి- మళ్లీ కశ్మీర్ అంశంలో జోక్యం
    కశ్మీర్​లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూ 131పేజీలతో కూడిన డాక్యుమెంట్​ను విడుదల చేసింది పాకిస్థాన్​. ఈ క్రమంలో భారత ప్రభుత్వంపై అనేక నిందలు వేసింది. కశ్మీర్​ అంశం మా దేశ అంతర్గత వ్వవహారమని భారత్​ ఎన్ని సార్లు చెప్పినా.. పాక్​ తన వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చనిపోయాడనుకున్న అల్​ఖైదా ఛీప్ ప్రత్యక్షం.. ఎలా?
    చనిపోయాడని ఇన్నాళ్లూ అనుకున్న అల్‌ఖైదా ఛీప్‌ అల్‌ జవహరీ.. ఓ వీడియోలో ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై అల్‌ఖైదా ఉగ్రదాడికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వీడియో విడుదల చేసింది అల్‌ఖైదా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జొమాటో నుంచి ఆ సేవలు బంద్​- ఈ నెల 16 లాస్ట్​ డేట్​
    జొమాటో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రానందుకు గ్రోసరీ సేవలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి తమ ప్లాట్​ఫాంపై గ్రోసరీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐదో టెస్టు రద్దుపై రవిశాస్త్రి స్పందన
    మాంచెస్టర్​ వేదికగా భారత్​, ఇంగ్లాండ్​ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు(India Vs England 5th Test) కరోనా కారణంగా రద్దైంది. అయితే ఈ మ్యాచ్​ రద్దవ్వడానికి ప్రధానకారణంగా టీమ్ఇండియా కోచ్​ రవిశాస్తి ఓ పుస్తకావిష్కరణ(Ravi Shastri Book Launch) కోసం వెళ్లడమే కారణమని మీడియాలో కొన్ని కథానాలు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • MAA Elections: మాటకు మాట.. బండ్ల గణేశ్​కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
    'మా' ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ.. పోటీదారుల మధ్య మాటల యుద్ధం కూడా పెరిగిపోతోంది. నేడు మా (MAA Elections) ఆర్టిస్టులకు ప్రకాశ్​రాజ్​ (Prakash Raj MAA elections) విందు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated : Sep 12, 2021, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details