ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM

ప్రధాన వార్తలు @ 9 PM

By

Published : Aug 28, 2021, 8:58 PM IST

TOP NEWS @9PM
TOP NEWS @9PM

  • ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
    తెలుగు రక్షణకు భాషావేత్తలు ఉద్యమస్థాయిలో పనిచేయాలన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ. వీధి అరుగు, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భాషా సదస్సులో ఆయన వర్చువల్​గా ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Land Survey: సమగ్ర భూసర్వే ప్రాజెక్టు సర్వేకు.. త్వరలోనే టెండర్లు!
    సమగ్ర భూసర్వే ప్రాజెక్టు సర్వేకు ప్రభుత్వం టెండర్లు జారీ చేయనుంది. హైబ్రిడ్ మెథడాలజీ విధానంలో భూసర్వే ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Letter To KRMB: హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలి: తెలంగాణ
    హంద్రీనీవా ఎత్తిపోతల నుంచి కృష్ణా జలాలను ఏపీ వాడకుండా చూడాలని.. కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్ లేఖ రాశారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం మాత్రమేనని.. హంద్రీనీవా ద్వారా కృష్ణా బేసిన్ బయటకు నీరు మళ్లించేందుకు అనుమతి లేదని మురళీధర్‌ ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • AP Govt: వివిధ శాఖలపై కోర్టుల్లో కేసులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
    వివిధ శాఖలపై కోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్లపై పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆన్‌లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ సిస్టం పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • School reopen: సీఎంలకు విద్యావేత్తల కీలక సూచనలు
    పాఠశాలలను తక్షణం తెరవాల్సిన (School reopen) అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు పలువురు వైద్యులు, విద్యావేత్తలు. విద్యార్థులకు వెంటనే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని కోరుతూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Covaxin Vaccine: వారికి కొవాగ్జిన్​ ఒక్క డోసు చాలు!
    కొవాగ్జిన్​పై(covaxin india) ఐసీఎంఆర్​ చేసిన అధ్యయంలో(icmr covid) కీలక విషయాలు వెలువడ్డాయి. కొవిడ్​ సోకని వారు టీకా రెండు డోసులు తీసుకుంటే ఉత్పన్నమయ్యే యాంటీబాడీల ప్రతిస్పందనలు.. వైరస్​ బాధితుల్లో ఒక్క డోసు వేసుకుంటేనే కనిపిస్తున్నాయని తేలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Kabul Attack: కాబుల్ దాడికి ఆర్​డీఎక్స్- పాకిస్థాన్ నుంచే!
    ఉగ్రవాదులే కాదు.. ప్రమాదకరమైన పేలుడు పదార్థాల తయారీకీ కేంద్ర బిందువుగా నిలుస్తోంది పాకిస్థాన్. ఆర్​డీఎక్స్, అమ్మోనియం నైట్రేట్, నకిలీ ఏకే-47లు... ఇలా దాడులకు కావాల్సిన సామగ్రిని లేదనకుండా ఉగ్రవాదులకు సరఫరా చేస్తోంది. ఐసిస్-కే చేసిన తాజా దాడుల్లో పాక్​లో తయారైన ఆర్​డీఎక్స్ మిశ్రమాన్నే వినియోగించినట్లు తేలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సెప్టెంబర్​ 1 నుంచి కొత్త రూల్స్​.. ఇవి తెలుసుకోండి...
    సెప్టెంబరు నుంచి పీఎఫ్​ ఖాతాకు ఆధార్​ అనుసంధానం చేసిన ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమకానున్నాయి. గ్యాస్​ ధర, జీఎస్​టీ ఫైలింగ్​లోనూ వచ్చే నెలలో కొన్ని కీలక మార్పులు రానున్నాయి. అవేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IndvsEng: 'మూడో టెస్టులో అందుకే ఓడిపోయాం'
    బ్యాటింగ్‌లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇంగ్లాండ్​ బౌలర్లు అద్భుతంగా ఆడటం వల్ల మూడో టెస్టులో ఓటమి చెందినట్లు తెలిపాడు టీమ్​ఇండియా సారథి కోహ్లీ. ఈ మ్యాచ్​లో తమ తప్పులు తెలుసుకొని ముందుకు సాగుతామని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సింధుకు చిరు సత్కారం.. ప్రముఖులతో సరదా సరదాగా!
    బ్యాడ్మింటన్ స్టార్​ పీవీ సింధును ప్రత్యేకంగా సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి. ఈమేరకు ఇన్​స్టాగ్రామ్​లో సింధును పొగుడుతూ పోస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details