ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

..

By

Published : Nov 28, 2021, 8:58 PM IST

TOP NEWS @9PM
ప్రధాన వార్తలు @9PM

  • Reorganization of districts in Andhra Pradesh: తెరపైకి జిల్లాల పునర్విభజన.. సీఎం జగన్ కీలక నిర్ణయం!
    రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన మరోసారి తెరపైకి(Reorganization of districts in Andhra Pradesh) వచ్చింది. శుక్రవారం ఎంపీలతో సమావేశమైన సీఎం జగన్.. ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Chandrababu letter to CS: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు..చంద్రబాబు లేఖ
    తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు..సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • AP Employees Unions future action for PRC: జగన్ సర్కారుపై ఉద్యోగ సంఘాల ఉద్యమం.. షెడ్యూల్ ప్రకటించిన నేతలు
    పీఆర్‌సీ నివేదికపై ప్రభుత్వం అనేకసార్లు మాట తప్పిందని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. ఉద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Financial Burden on AP : రాష్ట్రంపై ఆర్థిక భారం రూ.6.82 లక్షల కోట్లు?
    రాష్ట్రానికి అప్పులు ముప్పుగా (Financial Burden on AP) పరిణమించే స్థాయికి చేరుతున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రుణాలు తీర్చేందుకు మరో సంస్థ నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై 'ఒమిక్రాన్​' ఎఫెక్ట్​!
    కరోనా కొత్త వేరియంట్​ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా అధ్యక్షత అత్యవసర సమావేశం జరిగింది. కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెగసస్, నిరుద్యోగంపై చర్చకు విపక్షాల డిమాండ్​
    సోమవారం(నవంబరు 29) పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది కేంద్రం. పెగసన్, ధరల పెరుగుదల, నిరుద్యోగం.. తదితర సమస్యలపై చర్చలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఒమిక్రాన్'తో ఆ దేశాలు హడల్.. ఆఫ్రికా ప్రయాణికులపై ఆంక్షలు
    కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్(Omicron virus news).. మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇద్దరికి, నెదర్లాండ్స్​లో 13 మందికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఈ భయాల నేపథ్యంలో వివిధ దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గుడ్​ న్యూస్​.. డిసెంబరులో తగ్గనున్న గ్యాస్ ధర!
    కరోనా కొత్త వేరియంట్ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో చమురు సంస్థలు వచ్చే నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలను(LPG cylinder price:) భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IND vs NZ 1st test: ముగిసిన నాలుగో రోజు ఆట.. భారత్​దే పైచేయి
    భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓ వికెట్ కోల్పోయి నాలుగు పరుగులు చేసింది. కాగా, రెండో ఇన్నింగ్స్​ను 234/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది టీమ్​ఇండియా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రముఖ కొరియోగ్రాఫర్​ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
    ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ గచ్చిబౌలి ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారాయన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details