- Jawad Cyclone : ఆ తీరంవైపు కదులుతున్న "జవాద్".. వాతావరణ శాఖ తీపి కబురు
బంగాళాఖాతంలో దిశమార్చుకున్న 'జవాద్' తుపాను ప్రస్తుతం మందగమనంతో ఒడిశా తీరంవైపు సాగుతోందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే.. కొద్దిగంటల్లోనే ఇది బలహీనపడి.. తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
- BJP MP GVL On Jagan Govt: రెండున్నరేళ్లలో రూ.1.40 లక్షల కోట్ల అప్పు..దివాలా దిశగా రాష్ట్రం: జీవీఎల్
రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగిందని భాజాపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడలో జరిగిన భాజపా కోర్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించిన ఆయన.. జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.లక్షా 40 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తోందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
YSRCP MLA On Bhuvaneswari : భువనేశ్వరి అనుమతిస్తే.. కన్నీటితో పాదాలు కడుగుతాం: వైకాపా ఎమ్మెల్యే
శాసనసభలో భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. భువనేశ్వరి బాధపడి ఉంటే.. వైకాపా ఎమ్మెల్యేలందరమూ కలిసి కన్నీటితో ఆమె పాదాలు కడుగుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
- Minister Anil On Chandrababu: భాజపాలోని చంద్రబాబు ఏజెంట్లు.. కేంద్ర మంత్రితో అలా చెప్పించారు: మంత్రి అనిల్
భాజపాలోని చంద్రబాబు ఏజెంట్లు కేంద్ర మంత్రి షెకావత్‌తో.. అవాస్తవాలు చెప్పించారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. వరదలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న మంత్రి.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విపత్తులు రాలేదా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
- పంజాబ్ ఎన్నికల కోసం అమిత్ షా ట్రయాంగిల్ స్కెచ్!
కొద్ది నెలల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, శిరోమణి అకాలీ దళ్ మాజీ నేత దిండ్సాతో మంతనాలు జరుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
- జాబ్ అప్లికేషన్లతో పోటెత్తిన నిరుద్యోగులు- పోలీసుల లాఠీఛార్జ్
ఉద్యోగాల దరఖాస్తు కోసం వచ్చిన నిరుద్యోగులపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. క్యూలో నిల్చోలేదన్న కారణంతో వారిని కొట్టారు. బంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెర్హమ్పుర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాకు భారీగా యువత తరలిరాగా.. ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
- వ్యాక్సిన్ సర్టిఫికెట్ కోసం నకిలీ భుజం సృష్టించి.. అడ్డంగా బుక్కై...
కరోనా నుంచి రక్ష.. టీకానేనని వైద్య నిపుణులు పదే పదే చెబుతూనే ఉన్నారు. ఆసక్తి లేని కొందరు.. వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. కానీ.. ఇక్కడో వ్యక్తి మాత్రం వ్యాక్సిన్ సర్టిఫికెట్ కోసం ఆరోగ్య సిబ్బందినే మోసం చేశాడు. ఏకంగా నకిలీ భుజాన్నే సృష్టించుకొని టీకా తీసుకోబోగా బండారం బయటపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
- Jio Recharge Cashback Offers: ఆ రీఛార్జ్‌లపై 20% జియో క్యాష్‌బ్యాక్
ఇటీవల ప్రీపెయిడ్ ప్లాన్ల ధరను పెంచుతున్నట్లు జియో ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిన ఛార్జీలపై కొంతమేర క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు తెలిపింది. ఆ రీఛార్జ్‌లు ఏంటి? క్యాష్ బ్యాక్‌ను ఎలా ఉపయోగించుకోవాలి? పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
- లక్ష్మణ్‌కు జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు.. జై షా క్లారిటీ!
నేషనల్ క్రికెట్ అకాడమీ బాధ్యతలను టీమ్ఇండియా దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ చేపట్టనున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. లక్ష్మణ్ ఆ పదవికి ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
- RRR trailer: ఆర్ఆర్ఆర్ 'ట్రైలర్' రిలీజ్ అప్డేట్
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను నేరుగా థియేటర్లలోనే విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
TOP NEWS @7PM