ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7 PM

By

Published : Aug 13, 2021, 6:59 PM IST

ప్రధాన వార్తలు @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM

  • RAMACHANDRANAIDU : 'వ్యవసాయరంగంపై ఆధారపడే వారు క్రమంగా తగ్గుతున్నారు'

పరిశ్రమలకు సాగుభూమిని వాడకూడదనే నిబంధనతోనే తాము సంస్థలు ఏర్పాటు చేసినట్లు అమరరాజా సంస్థల ఛైర్మన్ (amararaja group chairman) రామచంద్రనాయుడు (ramachandra naidu) తెలిపారు. మనదేశంలో గ్రామాల్లో నివసించేవారే అధికంగా ఉన్నారని, వారికి ఏదైనా చేయాలని చిన్నప్పుడే అనుకున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విజయవాడలో సీఎం.. జిల్లాల్లో ఇన్​ఛార్జ్ మంత్రులు @ పంద్రాగస్టు వేడుకలు

పంద్రాగస్టు వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించనున్నట్లు సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • CS Meeting with IAS officers: 'ఐఏఎస్ అధికారులూ.. సచివాలయానికి రండి!'

రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశమయ్యారు. పరిపాలన గాడి తప్పకుండా సవ్యంగా జరగాలంటే అధికారులు సచివాలయానికి రావాలని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Corona cases today: మరో 1,746 కరోనా పాజిటివ్ కేసులు.. వైరస్ తో 20 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1,746 కరోనా కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. మహమ్మరి నుంచి మరో 1,648 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,766 యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • దిల్లీలో 'పంద్రాగస్టు' సందడి- భద్రత కట్టుదిట్టం

దేశరాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవ సందడి మొదలైంది. వేడుకల కోసం ఎర్రకోటను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అదే సమయంలో భద్రతా ఏర్పాట్లనూ చురుగ్గా చేపడుతున్నారు అధికారులు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్​ బ్యాన్- ఎప్పటి నుంచంటే?

సింగిల్ యూజ్ ప్లాస్టిక్​పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, ట్రేల తయారీ, విక్రయం, వాడకంపై నిషేధం విధించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అగ్రరాజ్యంలో తగ్గుతున్న శ్వేతజాతీయులు!

అమెరికా జనాభా లెక్కలను ఆ దేశ సెన్సస్​ బ్యూరో విడుదల చేసింది. దేశంలో శ్వేతజాతీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు వెల్లడించింది. 2010లో 63.7 శాతం ఉన్న శ్వేతజాతీయుల జనాభా 2020 నాటికి 57.8 శాతానికి పడిపోయిందని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Cyber Attacks: ఆ యాప్‌లతో జాగ్రత్త!

కాలంతో పాటు నగదు లావాదేవీల విషయంలో సమూల మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్​ చెల్లింపులు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోయాయి. ఇదే అదనుగా సైబర్ మోసాలు(Cyber Attacks) కూడా పెరుగుతున్నాయి. మరి ఆ మోసాల వలలో చిక్కుకోకుండా.. ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 28 ఏళ్లకే వరల్డ్​కప్​ విన్నర్ రిటైర్మెంట్

భారత ఫస్ట్​క్లాస్​ క్రికెటర్​ ఉన్ముక్త్​ చంద్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 28 సంవత్సరాలకే భారత క్రికెట్​కు వీడ్కోలు చెప్పాడు. విదేశీ లీగ్​లు ఆడతానని సంకేతాలు ఇచ్చాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గోవాలో 'సర్కారు వారి పాట' యాక్షన్ హంగామా

సూపర్​స్టార్ మహేశ్​బాబు తిరిగి యాక్షన్ మొదలుపెట్టేశారు. గోవాలో షూటింగ్​లో పాల్గొన్నారు. ఇటీవల వచ్చిన టీజర్ అభిమానులను తెగ అలరిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details