- 'వారి లేఖలు తిరస్కరించలేదు'
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను తిరస్కరించలేదని తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది. లేఖలను తిరస్కరిస్తున్నారని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండటం, ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల నుంచి కోటాకు మించి వచ్చిన లేఖలను తిరస్కరించామని వివరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతు
రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా మావోయిస్టు తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద విడుదలైన ఆడియో టేపు కలకలం రేపుతోంది. జగన్ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా సమరశీలంగా ఉద్యమించాల్సిన అవసరం ఆడియో టేపులో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నేడు కత్తి మహేశ్ అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన కత్తి మహేశ్ అంత్యక్రియలు..చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం యర్రావారిపాలెంలో నేడు జరుగనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బోనాల సందడి
ఊరూవాడా అంతా కలిసి సంబురంగా జరుపుకునే బోనాల పండుగు ఇవాళే షురూ అయింది. ప్రతిఏడులాగే ఈ ఏడు ఈ ఉత్సవాలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమయ్యాయి. భక్తులు.. జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. కరోనా నిబంధనలు పాటించేలా చూస్తూ.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'వారిని నామినేట్ చేయండి'
అసాధారణ పనితీరు కనబరుస్తూ, ఎవరికీ తెలియకుండా సాధారణంగా ఉండేవారిని పద్మ అవార్డులకు నామినేట్ చేయాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'జగన్నాథుడి'పై కళాకృతులు