ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Somasila reservoir: సోమశిలకు పోటెత్తిన వరద.. ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల - Somasila reservoir lifted 43 thousand cusecs

Somashila : రెండు రోజులుగా ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. వాగులు, వంకలు సైతం జలకళను సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరు ప్రవహిస్తూ కనిపిస్తోంది. నెల్లురూ జిల్లాలో సైతం సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరు గేట్లను తెరిచి.. 43 వేల క్యూసెక్కుల నీటికి కిందికి వదులుతున్నారు.

Somasila reservoir lifted 43 thousand cusecs
ఆరు గేట్లుతెరిచి పెన్నా నదికి నీరు విడుదల

By

Published : Oct 2, 2022, 4:30 PM IST

Updated : Oct 2, 2022, 5:16 PM IST

Somashila Reservoir: గత రెండు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పైనుంచి వచ్చే వరదనీటితో.. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి 34 వెల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో 6 గేట్ల ద్వారా 43 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నది ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సోమశిల, సంగం వద్ద పెన్నానది వారధిపై.. గేట్లను మూసివేసి రాకపోకలు నిలిపివేశారు. పెన్నా ద్వారా దిగువకు నీరు భారీగా వెళ్తుండటంతో నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సోమశిల జలాశయం ఆరు గేట్ల ద్వారా నీరు విడుదల
Last Updated : Oct 2, 2022, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details